Homeమహబూబ్‌నగర్‌El Niño | ఎల్ నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

El Niño | ఎల్ నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

  • తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంట్ల ధర్మార్జున్

ఆత్మకూర్: ఎల్ నినో(El Niño) ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కుంట్ల ధర్మార్జున్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం తెలంగాణ జన సమితి అనుబంధ రైతు సమితి జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కొల్లు కృష్ణారెడ్డి, పానుగోటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం దాచారం గ్రామంలో ఎండిపోయిన పైరు పొలాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ధర్మర్జున్ మాట్లాడుతూ ఎల్ నినో(El Niño) ప్రభావంతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని వానకాలం సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. యాసంగి ముందస్తుగానే అన్ని గ్రామాలలో రైతులను చైతన్యవంతులని చేసి రైతులకు ఆరుతడి పంటలు వేయడానికి ప్రోత్సహించి అవకాశం లేని రైతులకు కరువు భృతి కింద ఎకరానికి 20000 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

ఆయన వెంట ఎస్సీ సెల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చల కూరి గోపి, యువజన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగు నాయక్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్, ఈశ్వర్ సింగ్, మండల నాయకులు సైదులు, రాములు, సాంబ, శ్రీనివాసరెడ్డి నవీన్, ప్రవీణ్, మునిష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News