Homeనల్లగొండLand Irregularities | హుజూర్‌నగర్‌లో భూ అక్రమాల లీలలు...

Land Irregularities | హుజూర్‌నగర్‌లో భూ అక్రమాల లీలలు…

తహసీల్దార్‌, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులపై వేటు

  • సర్వే నంబర్లు 458,281 ఎన్ఎస్పీ,సీలింగ్ భూముల విక్రయాల్లో తీవ్ర అక్రమాలు…
  • ఆర్డీవో నివేదిక ఆధారంగా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కఠిన చర్యలు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ప్రభుత్వ సాగునీటి ప్రాజెక్టుల (ఎన్ఎస్పి) భూముల క్రయవిక్రయాల్లో జరిగిన అక్రమాలు(Land Irregularities) కలకలం రేపుతున్నాయి. భూ లావాదేవీల్లో భారీగా అవకతవకలకు పాల్పడటంతో పాటు విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ బి.కవిత,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) కాశీం షరీఫ్‌, గ్రామ పాలనాధికారి (జీపీవో) ఎస్‌.కే.జానీ పాషాలను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఒకేసారి ఒక కీలక అధికారి,ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది.శాఖాపరమైన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిమాణం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది

- Advertisement -

భూ రికార్డులు పరిశీలించకుండానే క్రయ విక్రయాలు

హుజూర్‌నగర్‌ మండలంతో పాటు పట్టణ పరిధిలోని సర్వే నంబర్లు 458,281లో ఉన్న ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు,ఆన్‌లైన్ రికార్డుల మార్పుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.ఈ సర్వే నంబర్లలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) సాగునీటి కాలువలకు చెందిన స్థలాలతో పాటు, భూసంస్కరణల చట్టం (సీలింగ్) పరిధిలోకి వచ్చే రూ.కోట్ల విలువైన భూములు ఉన్నాయి.గతంలో ఉన్న రెవెన్యూ రికార్డులను అంతకుముందు జరిగిన విచారణ నివేదికలను చివరికి కోర్టు ఆదేశాలను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు కంచె చేను మేసిందన్న చందంగా ఏకపక్షంగా భూముల లావాదేవీలను తెరలేపినట్లు ప్రాథమిక తనిఖీల్లో తేలింది. ఈ వ్యవహారంపై సమగ్ర పరిశీలన జరిపిన హుజూర్‌నగర్‌ ఆర్డీవో శ్రీనివాసులు జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించారు.

శాఖాపరమైన విచారణతో మరిన్ని నిజాలు బయటకు?

ఆర్డీవో నివేదిక ఆధారంగా కలెక్టర్ వెంటనే స్పందించి ఒక అధికారిని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.రికార్డుల నిర్వహణ,లావాదేవీల ధ్రువీకరణలో ఈ అధికారులకు ఎంతవరకు సంబంధం ఉంది?ఎవరెవరికి లబ్ధి చేకూర్చారు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.ప్రభుత్వ సాగునీటి ప్రాజెక్టుల భూముల రక్షణ పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.కాగా ప్రస్తుతం ఉన్న సస్పెన్షన్ ఉత్తర్వులు ప్రాథమిక చర్యల్లో భాగమేనని విచారణ పూర్తయిన తర్వాత ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలి పెట్టేది లేదని బాధ్యులపై మరింత కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.ఇప్పటికైనా భూ వ్యవహారాల్లో(Land Irregularities) పారదర్శకత, జవాబుదారీతనంకు పెద్ద పీట వేయాలని మండల ప్రజలు,రైతులు డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News