మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో(MLC Voter Registration) తమ పేర్ల నమోదుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు వాటి సంబంధించిన ధ్రువపత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని మఠంపల్లి తహసీల్దార్ కె.హిమ బిందు( Hima Bindu) సూచించారు.
ఈ మేరకు శనివారం ఆమె మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పట్టభద్రులు ఫారం-18తోపాటు తమ విద్యార్హత ధ్రువపత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకొని తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని కోరారు.కొందరు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, సంబంధిత ధ్రువపత్రాలను కార్యాలయంలో సమర్పించడం లేదని ఆమె పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన ఓటు నమోదు ప్రక్రియ పూర్తికాదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించి, ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను నవంబర్ 6లోపు పూర్తి చేసుకోవాలని పట్టభద్రులకు సూచించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
