- ఎంపీవో, పంచాయతీ కార్యదర్శికి గట్టి హెచ్చరిక..
- పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశం
ఏటూరునాగారం: ములుగు జిల్లా, మంగపేట మండలం, మల్లూరు గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారం ‘రాష్ట్ర సమాచార హక్కు కమిషన్” వరకు చేరింది. మల్లూరు దేవస్థానo ఆలయంలో కొబ్బరికాయల వేలం ద్వారా వచ్చిన నిధుల వివరాలు కోరినా సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.(RTI Commission Warning) సంబంధిత అధికారులను హెచ్చరిస్తూ, కోరిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించాలని ఆదేశించింది.
మల్లూరు గ్రామంలోని కొండగుట్టకు వెళ్లే మార్గంలో కొబ్బరికాయల విక్రయాల కోసం 2016 నుంచి వేలంపాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వేలం ద్వారా లక్షల రూపాయల ఆదాయం వచ్చినప్పటికీ, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా, ఎలాంటి లెక్కలు, పత్రాలు చూపకుండా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై స్తనిక వ్యాపారి యరంగారి వీరన్ కుమార్ సమాచార హక్కు చట్టం- 2005 కింద మండల పరిషత్ అధికారి. ఎంపీవో ప్రత్యేక అధికారి, గ్రామపంచాయతీ కార్యదర్శులను వివరాలు కోరారు.
అయితే సంబంధిత అధికారులు సమాచారం అందించకపోవడంతో ఆయన రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై శుక్రవారం (23-10-2026) ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని సమాచార హక్కు భవనంలో విచారణ జరిగింది. ఈ విచారణకు ఎంపీడీవో, మల్లూరు గ్రామపంచాయతీ కార్యదర్శిసమాచార హక్కు భవన్ కమిషన్ ముందు హాజరయ్యారు. వీరన్ కుమార్ కోరిన సమాచారం ఎందుకు అందించలేదని కమిషనర్ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది.
కోరిన సమాచారాన్ని తక్షణమే పూర్తి స్థాయిలో, సంతృప్తికరంగా అందించాలని కమిషనర్ ఇద్దరు అధికారులను గట్టిగా హెచ్చరించారు. ఆదేశాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో మల్లూరు గ్రామపంచాయతీ నిధుల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
