Homeవరంగల్‌Arrested | ములుగు 'రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ప్రవీణ్ అరెస్టు!

Arrested | ములుగు ‘రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ప్రవీణ్ అరెస్టు!

  • జాకారం సమీపంలో అదుపులోకి తీసుకున్న సీబీ సీఐడీ అధికారులు
  • గత నాలుగు రోజులుగా ప్రవీణ్ కోసం అధికారుల వేట
  • ఇటీవల ప్రవీణ్ మిల్లుల్లో సివిల్ సప్లైఅధికారులతనిఖీలు..తాజాగా అరెస్టు..

ఏటూరునాగారం: ములుగు జిల్లా “రైస్ మిల్లర్స్ అసోసియేషన్” అధ్యక్షుడు బాదం ప్రవీణ్(Badam Praveen) ను సీబీ సీఐడీ అధికారులు అరెస్టు(Arrested) చేశారు. ఆదివారం ఉదయం ములుగు జిల్లా జాకారం సమీపంలోని 163 జాతీయ రహదారిపై ఆయన వెళుతున్న కారులో నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన కోసం అధికారులు గాలిస్తుండగా.. ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. ఇటీవల ప్రవీణ్ కు చెందిన రైస్ మిల్లుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా, తాజాగా సీబీ సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకోవడం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

అయితే ప్రవీణ్ ఏ కేసులో భాగంగా అదుపులోకి తీసుకున్నారు? ఆయనపై ఉన్న అభియోగాలేమిటి? మిల్లుల్లో జరిగిన తనిఖీలకు ఈ చర్యలకు సంబంధం ఉందా? అనేఅసలు కారణాలేమిటన్న దానిపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. అరెస్టుల సందర్భంగా కొందరు మిల్లర్ల పై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం మరింత వివాదానికి కారణమైంది. ముఖ్యంగా అదుపులో ఉన్న బాదం ప్రవీణ్ పై చేయి చేసుకున్నారనే ఆరోపణలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

అయితే ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక వివరణ, అరెస్టులకు(Arrested) సంబంధించిన కేసుల వివరాలు, దాడి జరిగిందనే ఆరోపణలపై స్వతంత్ర నిర్ధారణ వెలువడాల్సి ఉంది. ఒక వర్గానికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడం, మరో వర్గాన్ని పోటీకి దూరం చేయడం లేదా ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం చేయడం కోసమే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇవి ఆరోపణలు మాత్రమే కాగా, వాటిని నిర్ధారించే ఆధారాలు, సంబంధిత అధికారుల వివరణఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. జిల్లాలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల వల్లకలుగుతున్న ఇబ్బందులు, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పెండింగ్ అంశాలు కొంతకాలంగా చర్చలోఉన్నాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడడంతోపాటు, మిల్లర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాలు, నష్టాలు,పెండింగ్ బకాయిల సమస్యలకు పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో మిల్లర్ల సమస్యలపై గొంతెత్తుతూ, వారి హక్కుల కోసం నిలబడిన వారిని లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమయంలో అరెస్టులు, బెదిరింపుల ఆరోపణలు తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోందని మిల్లర్ల వర్గాల్లోఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News