- ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయానికి కరెంటు సరఫరా చేయాలి… బి.ఆర్.ఎస్ పార్టీ విజ్ఞప్తి.
నర్సంపేట రూరల్ మండలం లోని గురిజాల గ్రామంలో బి.ఆర్.ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బావుల కింద ఎండిపోతున్న పంటలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ మోటూరి రవి మాట్లాడుతూ గురిజాల లో చాలా మంది రైతులు వరి మరియు ఇతర పంటలు సాగు చేశారని నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వము స్పందించి ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని రైతులను(Power Crisis) ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారుల ద్వారా సర్వే చేయించి నష్టపరిహారం రైతులకు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చిన్నపెళ్లి నరసింగం,మాజీ ఎంపీటీసీ లు గడ్డం కొమురయ్య,బండారి రమేష్,బండారి చిన్న వెంకటేశ్వర్లు,మాజీ రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు,మండల పార్టీ ఉప అధ్యక్షుడు అల్లి రవి,గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మంచిక దేవేందర్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పత్రి కుమారస్వామి,యూత్ మండల ప్రధాన కార్యదర్శి సంగం శ్రీకాంత్,సీనియర్ నాయకులు బండారి మల్లయ్య,కొమ్మ రవి,యశోద నర్సింగం,ఆరె సుధాకర్,శ్రీరామోజు మదుకర చారి,పుంజాల సంపత్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
