Homeఆదాబ్ ప్రత్యేకంTribal Land Encroachment | ఏజెన్సీ గిరిజన భూములపై అమాత్యుల కన్ను..

Tribal Land Encroachment | ఏజెన్సీ గిరిజన భూములపై అమాత్యుల కన్ను..

  • 1/70 చట్టం అమలుకు తూట్లు పొడుస్తున్న అధికారులు
  • పామాయిల్ సాగు పేరిట గిరిజనుల భూములు స్వాహా
  • బినామీ పేర్లతో సాగు.. నడిచే దారులకూ గేట్లు
  • అధికారుల తీరుపై గిరిజన సంఘాల ఆగ్రహం!
  • అక్రమంగా స్వాధీనం ఆపై రెవెన్యూ రికార్డుల్లో నమోదు
  • రెగ్యులర్ చేసుకోవడానికి సుప్రీం కోర్టుకు సైతం
  • సుమారు 800 ఎకరాలకు పాగా వేసిన అగ్ర కులస్తులు

ఆందోళన కలిగిస్తున్న ఏజెన్సీ భూములపై ఆక్రమణల ఆరోపణలు.. పామాయిల్ తోటల విస్తరణపై గిరిజనుల ఆందోళన.. గిరిజనుల భూములపై ఎవరి పెత్తనం? అధికారుల తీరుపై గిరిజన సంఘాల ప్రశ్నలు.. చక్రం తిప్పుతున్న ఓ బడా నేత.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట – దమ్మపేట ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూముల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఆందోళన కలిగిస్తున్న ఏజెన్సీ భూములపై ఆక్రమణల ఆరోపణలు.. పామాయిల్ తోటల విస్తరణపై గిరిజనుల ఆందోళన..(Tribal Land Encroachment) గిరిజనుల భూములపై ఎవరి పెత్తనం? అధికారుల తీరుపై గిరిజన సంఘాల ప్రశ్నలు.. చక్రం తిప్పుతున్న ఓ బడా నేత.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట – దమ్మపేట ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూముల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గిరిజనుల భూములకు రక్షణ కవచంగా నిలవాల్సిన 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ చట్టం లక్ష్యం నీరుగారుతోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గిరిజనుల జీవనాధారమైన భూములు బినామీ లావాదేవీలు, కౌలు సాగు పేరుతో అన్యాక్రాంతమవుతున్నాయని, ఆర్థిక బలంతో చిన్న చిన్న గుంటలుగా భూమిని స్వాధీనం చేసుకుని పామాయిల్ తోటలుగా మారుస్తున్నారని స్థానిక గిరిజనులు, నాయకులు ఆరోపిస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

- Advertisement -

మరోవైపు, తమ భూములకు వెళ్లే దారుల్లోనే గేట్లు ఏర్పాటు చేసి రాకపోకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.. గిరిజనుల హక్కులను కాపాడాల్సిన ఐటీడీఏ, రెవెన్యూ యంత్రాంగం ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? గిరిజనుల భూములకు భరోసా ఎక్కడ?(Tribal Land Encroachment) అన్న ప్రశ్నలతో గిరిజన సంఘాలు తమ ఆందోళనను ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ, అన్యాక్రాంతమైన భూముల పునరుద్ధరణ, బాధ్యులపై చట్టపరమైన చర్యలే తమ ప్రధాన డిమాండ్లని స్పష్టం చేస్తున్నాయి. కాగా ఈ అక్రమ వ్యవహారం వెనుక ఒక బడా నేత హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరడం.. అమాత్య పదవిని చేపట్టడం ఆయన ప్రత్యేకత.. ఎవరు ఆ పెద్దమనిషి..? గిరిజనుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు..? బాధ్యయుతమైన పదవిలో ఉంటూ.. ఈయన చేస్తున్న అరాచకాలు ఏమిటి..? ఈ అక్రమ వ్యవహారాలపై పూర్తి సమాచారంతో, సవివరమైన ఆధారాలతో.. సంచలన కథనంతో మీముందుకు రానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

‘ఆదాబ్ హైదరాబాద’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’‘..

- Advertisement -
RELATED ARTICLES

Latest News