- దాదర్ లోని రాజగృహ వద్ద సమావేశం..
- కెకె కమిటీ సూచనల మేరకు కార్యాచరణ..
తెలంగాణలోని కెకె కమిటి వారి సూచనల మేరకు సూరత్ ఉద్యమకారులు భివండి ముంబై జెఏసి ఉద్యమకారులతో సమావేశమైయ్యారు.. గురువారం ముంబై దాదర్ లోని రాజగృహ (అంబేడ్కర్ ఇల్లు) వద్ద ఇరు రాష్ట్రాల ఉద్యమకారుల తోలి ఐతిహాసిక కలయిక జరిగింది. మొదట, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ప్రకారం చిన్న రాష్ట్రాల నిర్మాణం ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ “రాజగృహాన్ని” సందర్శించి, అంబేడ్కర్ కు అభివాదం తెల్పి చర్చను ప్రారంభించారు. ఇందులో “సూరత్ వలస ప్రజల జెఏసి” పదాధికారులైన 5మంది అనుముల రవీందర్, గోనె సోమన్న, సిద్ధ శ్రీనివాస్, మచ్చ వీరన్న, గోడితాల లక్ష్మీపతి హాజరైయ్యారు.(Unity)
అయితే కెకె కమిటి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం సూచన మేరకు సూరత్, నవీముంబై, భివండి, ముంబై ఉద్యమకారుల మధ్య కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకోవాలని, దానిని “రాజగృహ” సాక్షిగా ఇరుపక్షాలచే సర్వ సమ్మతితో కోఆర్డినేషన్ ఏర్పాటు జరిగింది. 2వ అంశం భవిషత్తు కార్యాచరణపై ఇక ముందు ఇరు రాష్ట్రాల ఉద్యమకారులు సమష్టిగా “ఉద్యమకారుల గుర్తింపు కమిటీ”తో సంప్రదింపులు జరపాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన వెబ్ సైట్, పోర్టల్ గురించి సవిస్తర వివరణ, వాటిని ఎలా ఉపయోగించాలి అనే అంశంపై కూడా చర్చ సాగింది. ఈ ఐతిహాసిక సమావేశంలో భివండి ప్రతినిధులైన సిరిమల్ అశోక్, సిరిపురం తిరుపతి, ముంబై ప్రతినిధులు నిరటి భుమన్న, శివరాజ్ బొల్లే, రమేష్ చౌవల్, నాగసేన్ మాలజీ, అలివేలు యాకారి, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
