Homeఆదాబ్ ప్రత్యేకంKeesara | కీసరలో అవినీతికి అంతమెప్పుడు..?

Keesara | కీసరలో అవినీతికి అంతమెప్పుడు..?

  • లక్షల నుంచి కోట్ల రూపాయల లంచాల పరంపర..
  • ఏళ్లుగా అదే తీరు.. ఏసీబీ వలలో అధికారులు..
  • ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజల ప్రదక్షిణలు..
  • ముందుకు కదలని పెండింగ్ ఫైళ్లు..
  • లంచం ఇవ్వనిదే పని జరగదా..?
  • అధికారుల తీరులో మార్పు వస్తుందా..?
  • అయోమయంలో కీసర ప్రజానీకం..

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకమైన సేవలు ఖచ్చితంగా అందాల్సి ఉంటుంది.. కానీ కీసర(Keesara) మండల పరిధిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది..

వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు లంచం తీసుకుంటూ వరుసగా ఏసీబీ అధి కారులకి పట్టుబడుతుండడం చర్చనీయాంశంగా మారుతు న్నాయి. 2020 నుంచి 2026 సంవత్సరం వరకు పలు ఘటన ల్లో అధికారులు ఏసీబీకి పట్టు బడిన వార్తలు, ప్రభుత్వ కార్యాల యాల పనితీరుపై ప్రశ్నలు లేవ నెత్తుతున్నాయి. ఇన్ని ఘటనలు వెలుగులోకి వచ్చినా అవినీతికి అడ్డుకట్ట పడుతుందా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.

- Advertisement -

కీసర మండలంలో ఏసీబీకి చిక్కిన అధికారుల వివరాలు :

2020లో రూ.1.10 కోట్ల లంచం కేసులో ఎమ్మార్వో : రాంపల్లిదాయర ప్రాంతంలో 28 ఎకరాల భూ సెటిల్మెంట్ల విషయంలో 2020 ఆగష్టులో అప్పటి కీసర(Keesara) ఎమ్మార్వో నాగరాజు రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారీ మొత్తంలో లంచం వ్యవహారం వెలుగులోకి రావడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.

2020లో విద్యుత్ శాఖ అధికారులు : నాగారం సబ్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విజేయేందర్ రెడ్డి, సంతోష్‌లు ట్రాన్స్ఫార్మర్, మీటర్ కోసం బాధితుడి నుండి 2020 నవంబర్‌లో పదమూడు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

2023లో కీసర విద్యుత్ ఏఈ : చీర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల పనుల తనిఖీకి సంబంధించి రూ.12 వేల లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్ ఫిబ్రవరి 2023లో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

2024లో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ : ఇంజక్షన్ ఆర్డర్ రద్దు వ్యవహారంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ తరఫున కౌంట ర్ దాఖలు చేసి స్టాండింగ్ కౌన్సిల్‌కు పంపే అంశానికి సంబం ధించి రూ.30 వేల లంచం తీసుకుంటూ జూలై 2024లో అప్ప టి మున్సిపల్ కమిషనర్ ఎస్. రాజమల్లయ్య ఏసీబీకి చిక్కారు.

2025లో నాగారం మున్సిపల్ డిప్యూటీ ఈఈ : నాగారం మున్సిపాలిటీలో సీసీ రోడ్డు పనులకు సంబంధించిన రూ.11 లక్షల పెండింగ్ బిల్లులను ఆమోదిం చేందు కు రూ.1.30 లక్షల లంచం డిమాండ్ చేసి, అందులో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏప్రిల్ 2025లో డిప్యూటీ ఈఈ సుదర్శనం రఘు, ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు రాకేష్, సురేష్‌లు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

2026లోనూ కొనసాగుతున్న ఘటనలు : పీఎంఓ రిపోర్టుకు సంబంధించిన వ్యవహారంలో రూ.40 వేల లంచం తీసుకుంటూ గాంధీ ఆసుపత్రి వైద్యుడు సందీప్, హోంగార్డు నగేష్ ఫిబ్రవరి 2026లో ఏసీబీ అధికారులకు చిక్కారు. సెప్టెంబర్ 2026లో స్టేషన్ బెయిల్ ఇవ్వడం, వేధింపులకు గురిచేయకుండా ఉండడం కోసం రూ.5 లక్షలు తీసుకుంటూ కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిలు ఏసీబీకి పట్టుబడ్డారు. నెల రోజులు గడవక ముందే తాజాగా (అక్టోబర్ 2026) నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించే వ్యవహారంలో రూ.2.50 లక్షల లంచం తీసుకుంటుండగా కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి, వీఆర్వో విజయ్ కుమార్ ఏసీబీకి చిక్కిన ఘటన మండలంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

మార్పు ఎప్పుడు వస్తుంది..? : ఏళ్లుగా వరుసగా వెలుగుచూస్తున్న లంచం కేసులు ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబు దారీతనంపై చర్చకు దారితీస్తున్నాయి. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసు కోవడంతోపాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వరుస ఏసీబీ చర్యలతోనైనా అధికారుల పనితీరులో మార్పు వస్తుందా..? ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల ఆరోపణలకు అడ్డుకట్ట పడి ప్రజలకు పారదర్శకమైన పాలన అందుతుందా ? అన్నది వేచి చూడాలి..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News