- కంపుకొడుతున్న మరుగు దొడ్లు
- సూచనలకే పరిమితమైతున్న అధికారులు
- చెట్ల పొదలు , చెరువు కట్టలే దిక్కు
- కార్యాలయంలో మరుగు దొడ్లు ఉన్నాయని కబుర్లు
జగదేవపూర్: ఆ కార్యాలయంలో మరుగుదొడ్లు ఉన్నాయని వాటిని ఆ కార్యానికి వచ్చే ప్రజలకు ఏమాత్రం తెలియదు ఒకవేళ మరిచిపోయి ఎవరినైనా అడిగితే అదిగో అక్కడ ఉన్నాయి వెళ్ళండి అంటే వెళ్లిన వారికి చుక్కలేనం డోయ్. ఆ మరుగుదొడ్డికి వెళ్లాలంటే వాటికి అడ్డంగా ఉన్న చెత్త, చెదారం , విరిగిన కుర్చీ పైపులను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అది ఎక్కడో కాదండోయ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని దుస్థితి. పూర్తి వివరాలోనికి వెళితే మండల కేంద్రంలోని స్థానిక(Jagadevpur) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మరుగుదొడ్లు పర్యవేక్షణ లోపం వల్ల అవి కంపు కొడుతున్నాయి.

ఆ కార్యాలయంలో ఉన్నా అధికారులు ఏ ఒక్కసారి వాటినిపై కన్నెత్తి చూడలేదా. వారు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకూడని నీతులు చెబుతున్నారు. కార్యాలయంలో ఉన్న వాటిపై దృష్టి పెట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వారి కార్యాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, సామాన్యులు చెట్ల, పొదలు చెరువుగట్లపై మలమూత్ర విసర్జన చేయడం ఆయన దృష్టికి రాలేదా..? ఒకవేళ వస్తే వారు ఎక్కడికి వెళ్తే నాకేంటి అంటూ లైట్ తీసుకుంటున్నారా…?కార్యాలయంలో ఉన్న మూత్రశాలలను శుభ్రం చేయించాలని ఆయనకు తెలువదా అంటూ ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటున్నారు.

ఇప్పటికై వాటిపై దృష్టి పెట్టి ఆ కార్యాలయంలో ఉన్న మరుగుదొడ్లలో ఉన్న విరిగిన కుర్చీలు, పాత పైపులు లను తొలగించి వాడిని శుభ్రం చేయించి ఆ కార్యాలయానికి వచ్చే వారు చెట్ల పొదలు చెరువుగట్లపై వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పలువురు రిక్వెస్ట్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
