- గ్యాస్ లారీ వెనుక టైర్ కిందపడి యువకుడు మృ*తి
- కుటుంబంలో విషాదం
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం–రాంపల్లి చౌరస్తా వద్ద శనివారం ఘో*ర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. గ్యాస్ లారీ వెనుక టైర్ కిందపడి అఖిల్ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృ*తి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. అఖిల్ ఉదయం జిమ్ ముగించుకుని తన ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాగారం నుంచి అహ్మద్‌గూడ వైపు వెళ్తున్న గ్యాస్ లారీ ప్రమాదవశాత్తు అతడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అఖిల్ శివానందపురి కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చేతికొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో(Road Accident) మృ*తి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
