Homeరంగారెడ్డిRoad Accident | రాంపల్లి చౌరస్తాలో ఘో*ర రోడ్డు ప్రమాదం

Road Accident | రాంపల్లి చౌరస్తాలో ఘో*ర రోడ్డు ప్రమాదం

  • గ్యాస్ లారీ వెనుక టైర్ కిందపడి యువకుడు మృ*తి
  • కుటుంబంలో విషాదం

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగారం–రాంపల్లి చౌరస్తా వద్ద శనివారం ఘో*ర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. గ్యాస్‌ లారీ వెనుక టైర్‌ కిందపడి అఖిల్‌ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృ*తి చెందాడు.

స్థానికుల వివరాల ప్రకారం.. అఖిల్‌ ఉదయం జిమ్‌ ముగించుకుని తన ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాగారం నుంచి అహ్మద్‌గూడ వైపు వెళ్తున్న గ్యాస్‌ లారీ ప్రమాదవశాత్తు అతడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అఖిల్‌ శివానందపురి కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.

- Advertisement -

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చేతికొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో(Road Accident) మృ*తి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News