Homeరంగారెడ్డిBonalu | కోతపేట డివిజన్‌లో ఘనంగా బోనాలు

Bonalu | కోతపేట డివిజన్‌లో ఘనంగా బోనాలు

  • పల్లారం బండి ఊరేగింపు

హైదరాబాద్‌లోని కోతపేట డివిజన్‌లో నిన్న బోనాలు–పల్లారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ కోతపేట డివిజన్ నాయకులు వి. సుందర్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్ చకిలం కుటుంబ సమేతంగా కార్యక్రమానికి హాజరై, అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News