HomeతెలంగాణPonnam Prabhakar | పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య..

Ponnam Prabhakar | పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య..

  • ఇదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం – మంత్రి పొన్నం ప్రభాకర్..
  • జగిత్యాల జిల్లా తాటిపల్లిలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’..
  • సుమారు రూ.200 కోట్ల వ్యవంతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం..
  • 2,500 మంది విద్యార్థులకు అత్యాధునిక రీతిలో విద్య.
  • వచ్చే విద్యా సంవత్సరం నాటికి కనీసం 10 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్..
  • నాణ్యమైన భోజనం, పుస్తకాలు, యూనిఫాంల అందజేత..
  • విద్య, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం..
  • యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన..

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు.

ఆదివారం జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన రాజకీయ ప్రస్థానం విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైందని తెలిపారు. పేద ప్రజలకు అందించగలిగే అత్యంత విలువైన సంపద విద్యేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన కులగణనలోనూ విద్య ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న విషయం స్పష్టమైందని తెలిపారు. జిల్లా కలెక్టర్బి . సత్యప్రసాద్ విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగారని, గురుకుల విద్యాసంస్థల్లో చదువుకున్న ఎంతోమంది నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాష్ట్రంలోని 326 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో కేవలం 26 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఒకే ప్రాంగణంలో నాలుగు గురుకుల విద్యాసంస్థలకు అవసరమైన భవనాలను నిర్మించేలా చర్యలు చేపట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరూ ఒకే చోట విద్యనభ్యసించేలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కనీసం 10 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు పేర్కొన్నారు. గురుకులాలకు సంబంధించిన బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా క్రమం తప్పకుండా చెల్లించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం :

ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పెట్టుబడి సాయం పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల మేర రుణమాఫీ చేశామని, రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా 75 వేల ఉద్యోగాల నియామకాలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

సూపర్ ఎల్‌నినోను రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాలి :

పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సూపర్ ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడ్డాయని, రాష్ట్రంలో కరువును ఎదుర్కొనేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రకృతి పరిస్థితులను రాజకీయాలకు ముడిపెట్టి విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో కొండగట్టు బస్సు ప్రమాదం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు తాము అప్పటి ప్రభుత్వాన్ని నిందించలేదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తెలంగాణ జలసిరి కార్…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News