- తాడ్వాయి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్.
మండలంలోని నిరుద్యోగ యువతి, యువకులు,సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మదన్మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే భారీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తాడ్వాయి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాటిపాముల ప్రశాంత్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే తన నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతకు ఉపాధికల్పనే లక్ష్యంగా 70కి పైగా ప్రముఖ కంపెనీలతో 5వేల కు పైగా ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తూ జాబ్ మేళాను ఏర్పాటు చేశారని ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ, యువకులు, పాల్గొని ఉద్యోగాలు పొందాలని ఈ సందర్భంగా సూచించారు.
పదో తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకున్న అభ్యర్థులు అందరు కూడా ఈ జాబ్ మేళా పాల్గొనలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఇది ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. జాబ్ మేళా ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే మదన్మోహన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
