- హింసాత్మకంగా మారిన నిరసనలు..
- అనేక పట్టణాలకు వ్యాపించిన ఆందోళనలు..
- దాదాపు 1000 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- నిరసనల్లో పెద్ద ఎత్తున ప్రజలు, యువత..
ఫ్రాన్స్ లో ప్రజలు, యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో ఆందోళన(France Protests) ఉధృతంగా కొనసాగుతోంది. జీవన వ్యయం పెరగడం, నిత్యవసరాల సరుకులు అందుబాటులో లేకపోవడం, నిరుద్యోగం వంటి సమస్యల్ని నిరసిస్తూ ఫ్రాన్స్‌లో ప్రజలు ఆందోళనబాట పట్టారు. ఈ క్రమంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. మొదట ఫ్రాన్స్ వరకే పరిమితమైన ఆందోళనలు (France Protests) ఇప్పుడు అనేక పట్టణాలకు విస్తరించాయి. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు 1,000 మందిని అరెస్టు చేశారు.
ఈ విషయాన్ని ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి లారెంట్ నునెజ్ వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 4,10,000 మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే, నిర్వాహకులు మాత్రం 8,00,000 మంది ఆందోళనల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఆందోళనల్లో కొందరు నిరసనకారులు షాపులు దహనం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు.
షాపుల్ని లూటీ చేస్తున్నారు. దీంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. కోర్స్ డి విన్సెన్నెస్ ప్రాంతంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఈ ప్రాంతంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు హెలికాప్టర్లను కూడా వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనల్ని అదుపు చేయడానికి వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్, గ్రెనడ్లు వంటివి వాడుతున్నట్లు వివరించారు. శాంతి భద్రతల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. లియోన్, లిల్లె, మార్సెల్లి సహా ఇతర పట్టణాల్లోనూ ఆందోళనలు జరిగాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
