Homeరంగారెడ్డిBathukamma Celebrations | మేడ్చల్‌లో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు

Bathukamma Celebrations | మేడ్చల్‌లో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు

  • ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఉత్సవాలు(Bathukamma Celebrations) మేడ్చల్ పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆర్ఆర్ (RR) ఫౌండేషన్ అధినేత రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.మేడ్చల్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా, ఆటపాటలతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేలా ఫౌండేషన్ తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా డీజే బాక్సులు, విద్యుత్ దీపాల అలంకరణ మరియు సౌకర్యాలను కల్పించారు.

ఈ సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మేడ్చల్ పట్టణంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకుంటూ, మహిళలందరూ ఒకే చోట చేరి ఉల్లాసంగా గడపడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో పట్టణానికి చెందిన వందలాది మంది మహిళలు, యువతులు రంగురంగుల బతుకమ్మలతో పాల్గొని,సాంప్రదాయ నృత్యాలతో అలరించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎస్హెచ్ఓ అంజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ కావిడ మహేష్, కటిక వినయ్,ఫౌండేషన్ ప్రతినిధులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News