- ఒక జీ.హెచ్.ఎం.సి. ఉద్యోగి, డ్రైవర్ మృతి..
- దర్యాప్తు కొనసాగుతోందన్న అధికారులు..
సంగారెడ్డి జిల్లా కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Accident) ఇద్దరు మృతి చెందారు. వివరాళ్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కొల్లూర్ అవుటర్ రింగ్ రోడ్ పైన డివైడర్ మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ టాంకర్‌ను అతి వేగంగా వచ్చి అశోక్ లేలాండ్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో(Accident) అశోక్ లేల్యాండ్ వాహనంలోని డ్రైవర్ శ్రీనాథ్ (25) క్యాబిన్లో ఇరుక్కొని తీవ్ర గాయాలై మృతి చెందాగా చెట్లకు నీళ్ళు పడుతున్న జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రీనివాస్ (30)అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పఠాన్‌చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
