జూన్ 21న “హరి ఉదాన్ 2026” కార్యక్రమం
రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ఇంటర్మీడియట్ విద్యార్థులను గుర్తించి గౌరవించే లక్ష్యంతో హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో “హరి ఉదాన్ 2026 – స్టేట్ మెరిట్ ఎక్సలెన్స్ అవార్డ్స్” కార్యక్రమాన్ని ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను హరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. ఎం. నర్సిరెడ్డి ఆవిష్కరించారు.
హైదరాబాద్ సమీపంలోని కాన్హా శాంతివనంలో ఉన్న హరి యూనివర్సిటీ క్యాంపస్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్‌లో 95 శాతం మరియు అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్స్ ఆఫ్ ఎక్సలెన్స్తో పాటు మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్స్ అందజేయనున్నారు.
విద్యా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులకు భవిష్యత్ కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించడం కూడా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం కెరీర్ గైడెన్స్ సెషన్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ అవగాహన కార్యక్రమాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి భవిష్యత్ రంగాల్లో అవకాశాలపై నిపుణుల ప్రసంగాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ విద్యావేత్తలు, ఉన్నత విద్యా రంగ నిపుణులు హాజరుకానున్నారు. వారిలో హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ గైడ్ మరియు హరి వ్యవస్థాపకులు శ్రీ కమలేష్ డి. పటేల్ (దాజీ), తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, జేఎన్‌టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి, సీబీఐటీ డీన్ డాక్టర్ ఎన్.ఎల్.ఎన్. రెడ్డి, డాక్టర్ సాయిరాం రెడ్డి పాలిచర్ల, శ్రీ వంశీ చలగుళ్ల తదితరులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డా. ఎం. నర్సిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల కృషిని గుర్తించి గౌరవించడం ద్వారా వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే హరి ఉదాన్ లక్ష్యమన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలు మరియు నాయకత్వ అవకాశాలను పరిచయం చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు.
హరి యూనివర్సిటీ దాజీ విజన్ ఆధారంగా విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు మానవ విలువల సమన్వయంతో భవిష్యత్ తరాలకు అవసరమైన సమగ్ర విద్యను అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
అర్హత కలిగిన విద్యార్థులు https://www.hariuniversity.com/
వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
వివరాలకు:
9491026262
9492092926
తేదీ: జూన్ 21, 2026
వేదిక: హరి యూనివర్సిటీ, కాన్హా శాంతివనం, హైదరాబాద్
“ప్రతిభను గౌరవిద్దాం… భవిష్యత్ నాయకులను ప్రోత్సహిద్దాం” అనే నినాదంతో హరి ఉదాన్ 2026 కార్యక్రమం నిర్వహించబడుతోంది.
