నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అన్నట్టుగా ఎస్ఐ మాధవరెడ్డి పేర్కొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంగూరు మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తు. దసరా సందర్భంగా రేపు (20.10.2026) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని సందర్శించనున్నారు.
దీని కారణంగా ఆ గ్రామ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమల్లో ఉంటాయని వంగూరు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. కొండారెడ్డిపల్లి మీదుగా పోల్కంపల్లి, చింతపల్లి, ఉప్పునూతల, అచ్చంపేట వైపు ప్రయాణించేవారు ఆ గ్రామం మీదుగా వెళ్లకుండా శ్రీశైలం హైవే మార్గాన్ని వాడాలని పోలీసులు ప్రజలకు సూచించారు. అనవసర ఇబ్బందులుతప్పించుకోవడానికి ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో వేరే మార్గం ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
