Tuesday, June 16, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంGhatkesar | మామూళ్ల మత్తులో… ఘట్కేసర్ ఎక్సైజ్

Ghatkesar | మామూళ్ల మత్తులో… ఘట్కేసర్ ఎక్సైజ్

ఘట్కేసర్ ఎక్సైజ్ శాఖ మామూళ్ళ మత్తులో మునిగి, అందిన కాడికి దోచుకుంటూ వైన్స్ లను బార్లుగా మార్చిన యజమానులను ప్రోత్సహిస్తుంటే…సమయపాలన లేకుండా నడి రోడ్డుపైనే మందుబాబులు హల్చల్ చేస్తూ రోడ్డున పోయే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

  • మేడిపల్లి మండలంలో పలు వైన్సులు బార్లను తలపిస్తూ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు.
  • బోడుప్పల్‌లో మధ్యాహ్నం నుండి అర్ధరాత్రి వరకు బహిరంగ మద్యం సేవనం. ఎవరైనా జోక్యం చేసుకుంటే దాడులు.
  • ప్రశ్నార్థకంగా మారిన మహిళల భద్రత… ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం.కనబడని పోలీసులు,ఎక్సైజ్ శాఖ.

మల్కాజిగిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం నుంచి చిలకానగర్ ప్రధాన రహదారి వరకు,ముఖ్యంగా బంగారు మైసమ్మ వైన్స్ పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు,సంబంధిత పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు,వృద్ధులు, స్థానిక కాలనీవాసుల నుండి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రోడ్లపై మద్యం సేవనం,అసభ్య ప్రవర్తన,గుంపులుగా చేరి హల్‌చల్ చేయడం వల్ల మహిళలు, విద్యార్థులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

“తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ శాఖ ఫెయిల్ అయ్యిందా..? చట్టాలు కేవలం పుస్తకాలకే పరిమితమా..? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బహిరంగ మద్యం సేవనాన్ని అరికట్టడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.ప్రజా రహదారులను మందుబాబుల అడ్డాలుగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ, పోలీసు అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా..? లేక ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతి త్వరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ వైన్స్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు హెచ్చరికలు జారీ కావడంతో ఈ వ్యవహారం మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

ఓపెన్ బార్లను తలపిస్తున్న వైన్సులు

ఘట్కేసర్ ఎక్సైజ్ పరిధిలోని పలు వైన్స్ లలో నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ కోసం తక్కువలో తక్కువగా వేయి గజాల నుండి ఎక్కడ భూమిలో మందుబాబులకు సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తీరికగా కూర్చుని తాగడానికి టేబుల్స్ కుర్చీలు మరియు అక్కడే తినడానికి పలు తినుబండారాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

వాస్తవానికి నిబంధనలను పరిశీలిస్తే…

సిట్టింగ్ రూమ్ కేవలం 10×10 సైజులు అంటే 100 చదరపు అడుగులలోపే ఉండాలి. ఇందులో తాగడానికి గ్లాసు మంచినీటి ప్యాకెట్ తినడానికి ఏమైనా తినుబండారాలు పెట్టుకోవడానికి ఒక చిన్న గోడకు ఆనుకొని ఉన్న పొడవాటి చెక్క బల్ల మాత్రమే ఉండాలి.మందుబాబులు కూర్చుని తాగడానికి ఎలాంటి కుర్చీలు వేయకూడదు. నిలబడి అక్కడికి అక్కడే తాగి వెళ్ళిపోవాలి.

బహిరంగ ప్రదేశాలలో తాగిన వారిపై చర్యలు తీసుకుంటాం… ఘట్కేసర్ ఎక్సైజ్ సీఐ రవి

వైన్స్ ల పరిసర ప్రాంతాలలో బహిరంగంగా తాగే వారిపై మరియు నిబంధనలను అతిక్రమించిన వైన్స్ ఓనర్లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఘట్కేసర్ ఎక్సైజ్ రవి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News