Homeస్పోర్ట్స్Ekta Bishnoi | చరిత్ర సృష్టించిన ఇండియన్ ఐ.ఆర్.ఎస్. అధికారిని..

Ekta Bishnoi | చరిత్ర సృష్టించిన ఇండియన్ ఐ.ఆర్.ఎస్. అధికారిని..

  • పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మూడు స్వర్ణాలు..
  • అమెరికాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్..

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారిణి ఏక్తా బిష్ణోయ్(Ekta Bishnoi) క్రీడా ప్రపంచంలో చరిత్ర సృష్టించారు. అమెరికాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని దేశం గర్వపడేలా చేశారు. ఈ విజయంతో, మాస్టర్స్-2 విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా పవర్‌లిఫ్టర్‌గా ఆమె రికార్డులకెక్కారు.

ఈ పోటీల్లో ఏక్తా బిష్ణోయ్ మొత్తం 362.5 కిలోల బరువును ఎత్తి, జపాన్, కెనడాకు చెందిన బలమైన ప్రత్యర్థులను అధిగమించారు. ఒకవైపు ఉన్నత ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, కఠినమైన పవర్‌లిఫ్టింగ్ శిక్షణను కొనసాగించడం ఆమె అంకితభావానికి నిదర్శనం.

- Advertisement -

అయితే, ఈ విజయం అంత సులువుగా దక్కలేదు. టోర్నమెంట్‌కు ముందు భారత జట్టు కోచ్ సునీల్ కుమార్ యూఎస్ వీసా తిరస్కరణకు గురైంది. అయినా ఏమాత్రం వెనకడుగు వేయని ఏక్తా, వీడియో కాల్స్ ద్వారా కోచ్ సునీల్ నుంచి సూచనలు తీసుకున్నారు. టీమ్ అధికారి ఇబ్రహీం సహకారంతో వ్యూహాత్మకంగా ఆడి చారిత్రక విజయాన్ని అందుకున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News