- బాధితులకు పరామర్శ..
- అమిత్ వెంట సీఎం సువేందు అధికారి..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దుర్గా పూజ ఉత్సవాల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉత్తర కోల్కతాలోని చోర్బగాన్ సార్వజనిన్ దుర్గా పూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) నేడు కోల్కతాలో పర్యటించి, బాధితులను పరామర్శించారు.
ఈ విషాద ఘటన కారణంగా రాష్ట్రంలో తన ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను అమిత్ షా(Amit Shah) వాయిదా వేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వెంటరాగా, ఆయన నగరంలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి, రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ శరద్వత్ ముఖర్జీ కూడా గాయపడిన వారిని పరామర్శించారు.
ఈ ఘటనపై కోల్కతా పోలీసులు వేగంగా స్పందించారు. తొలుత 14 మందిని అదుపులోకి తీసుకోగా, విచారణ అనంతరం పూజా కమిటీ నిర్వాహకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కమిటీ కార్యదర్శి, ఉపాధ్యక్షుడు కూడా ఉన్నారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, హత్యకు సమానం కాని నరహత్య కింద అభియోగాలు నమోదు చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
