- సంతోషం వ్యక్తం చేసిన భారత ప్రధాని మోడీ..
- శాంతి స్థాపన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం..
పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడనున్న విషయం తెలిసిందే. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మోదీ స్పందించారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ డీల్ అమలు వల్ల పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో మళ్లీ స్థిరత్వం వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇక ఒప్పందం కుదరని అంశాలపై కూడా సమగ్రమైన అగ్రిమెంట్ జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన ఎక్స్ అకౌంట్లో ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సమస్యలు ఉత్పన్నమైనట్లు వెల్లడించారు. అనేక దేశాల్లో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లు చెప్పారు. నిరంతర చర్చల ప్రక్రియ ద్వారా వాషింగ్టన్, టెహ్రాన్ తమ మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
