Sunday, June 14, 2026
Homeఆదిలాబాద్Singareni | శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ సందర్శించిన డిప్యూటీ సీఎం

Singareni | శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ సందర్శించిన డిప్యూటీ సీఎం

  • సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం…
  • రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క

సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ సందర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, సింగరేణి సి ఎం డి బుద్ధ ప్రకాష్ జ్యోతి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డి.సి.పి. ఎ.భాస్కర్, సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్లు, సింగరేణి కార్మిక సంఘం ప్రతినిధి జనక్ ప్రసాద్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సింగరేణి సంస్థను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు. ఓపెన్ కాస్ట్ మైన్ సందర్శనలో భాగంగా రక్షణ పద్ధతులు, బొగ్గు నాణ్యత, ఉత్పత్తి ఉత్పాదకత, నిల్వ, రవాణా వంటి అంశాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

గ్రేడ్ 10, 11 బొగ్గు ఉత్పత్తి, బొగ్గు నిల్వ ప్రదేశాలు, రికార్డులు పరిశీలించడం జరిగిందని తెలిపారు. కార్మికులు శ్రమ, చెమట తో బొగ్గును ఉత్పత్తి చేసి సంస్థను అభివృద్ధి చేయడమే కాకుండా దేశానికి వెలుగులు అందిస్తున్నారని, వారి ఆత్మ గౌరవం కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. వీటిని అపహాస్యం చేస్తూ కొంత మంది అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సింగరేణి సంస్థ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని, ఇందులో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని, సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి అని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి రావాలని తెలిపారు. కార్మికుల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం అధునాతన వైద్య పరికరాలు, నూతన వైద్య విధానాల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యారంగా అభివృద్ధిలో భాగంగా జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో నవీకరించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి పిల్లల విద్యకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

సింగరేణి కార్మికులకు 1 కోటి 25 లక్షల రూపాయల ప్రమాద భీమా కల్పించడం జరిగిందని, సింగరేణి కార్మికుల పిల్లలకు యు.పి.ఎస్.సి. పరీక్షలు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సమన్వయంతో సింగరేణి బొగ్గు గనులను మరింత అభివృద్ధి చేసి కార్మికుల సంక్షేమం దిగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు, సంబంధిత శాఖల అధికారులు, సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News