బెల్లంపల్లి పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో ( A-3 క్వార్టర్ ) మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు , టీబీ జీ కె ఎస్ అధ్యక్షుడు శ్రీ మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిథిలుగా బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి బీ ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు సర్ కార్యక్రమాలపైన సన్నాహాక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సభాధ్యక్షులు, ముఖ్య అతిథిలు మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటున్న ప్రతీ కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటామని, రానున్న బీ ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.
అదేవిధంగా ఈసారి బీ ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొత్తం డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న సందర్భంగా ఆయా బూత్ ఇంచార్జిలు సభ్యత్వాలను పకడ్బందీగా నిర్వహించాలని, అలాగే ప్రభుత్వ కార్యక్రమమైన సర్ కార్యక్రమంలో కూడా బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు అప్రమత్తంగా ఉంటూ అధికారులతో సమన్వయం చేసుకొని కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, నూనెటి సత్యనారాయణ,మరియు నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, బూత్ ఇంచార్జిలు, బీ ఎల్ ఏ లు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
