Monday, May 18, 2026
Homeమహబూబ్‌నగర్‌Wanaparthy | వివాహిత అనుమానాస్పద మృ*తి ..

Wanaparthy | వివాహిత అనుమానాస్పద మృ*తి ..

  • భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్న కాలనీ ప్రజలు.

వనపర్తి పట్టణంలో 21 వ వార్డు హరిజనవాడకు చెందిన వివాహిత బంకలి అరుణ w/o బంకలి రాజశేఖర్ (వయసు 30 సం:) అనుమానాస్పదంగా మృ*తి చెందింది. ఈ విషయంపై స్థానిక కాలనీ వాసులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు. సోమవారం జరిగిన ఈ మానవీయ సంఘటన సమాజానికి తలవంపు అని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనంతరం నిజ నిజాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అనుమానంగా ఉన్న భర్త రాజశేఖర్ పోలీసుల అదుపులో ఉన్నారు. మృ*తురాలికి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News