Homeవరంగల్‌Sanitation Awareness | ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి కావాలి...

Sanitation Awareness | ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి కావాలి…

  • ముకునూరు పాలెం గ్రామంలో అవగాహన కార్యక్రమం….
  • కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సమావేశం…

వెంకటాపురం: ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కాఫర్డ్ స్వచ్ఛంద సంస్థ వెంకటాపురం డైరెక్టర్ లూర్దు రాజ్ సూచించారు. మండలం లోని ముకునూరు పాలెం గ్రామంలో కాఫెడ్ స్వచ్చంధ సంస్థ అధ్వర్యంలో సోమవారం మన ఇంటికి – మన బాత్‌రూమ్ అనే పారిశుధ్య అవగాహన కార్యక్రమం(Sanitation Awareness) నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాఫెడ్ స్వచ్చంధ సంస్థ డైరెక్టర్ లూర్థు రాజు ఉపాధి హామీ పథకం టి ఎ సాయిబాబు హాజరై మాట్లాడారు. “ప్రతి ఇంటికి మరుగుదొడ్డి – ఆరోగ్యకరమైన కుటుంబానికి తొలి అడుగు”, మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం ప్రతి కుటుంబ సభ్యుడి బాధ్యత అని వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా, ప్రతి ఇంటిలో సురక్షితమైన మరుగుదొడ్డిని నిర్మించుకొని, దానిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా మన గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చని తెలిపారు.

- Advertisement -

మరుగుదొడ్డి వినియోగం వల్ల వ్యాధుల వ్యాప్తిని తగ్గించడంతో పాటు, మహిళలు, పిల్లలు మరియు వృద్ధులకు భద్రత, గౌరవం కలుగుతుందన్నారు.

ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు.
మరుగుదొడ్డిని ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నివారించాలని, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని వివరించారు. ఇంటి చుట్టూ చెత్త, మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కొప్పుల వెంకటేశ్వర్లు, గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, వెంకటాపురం కోఆర్డినేటర్ గొంది హనుమంత్, యానిమేటర్స్ నరేష్, ప్రశాంత్, ఇందిరా, పద్మ, ఉషా పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News