- వెల్లడించిన అమెరికన్ సైనిక దళాలు..
- అమెరికా సంసిద్ధంగా ఉందన్న అధికారులు..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు అందిన 96 గంటల్లోనే ఇరాన్‌పై దాడులు చేసేందుకు పశ్చిమాసియాలో దళాలు సిద్ధంగా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. పశ్చిమాసియా ప్రాంతంలో సమృద్ధిగా తమ దళాలను మోహరించినట్లు ఇద్దరు అధికారులు సీఎన్ఎన్ మీడియాతో తెలిపారు. ఇరానీ రేడార్లు, మిస్సైల్ లాంచర్లు మాత్రమే కాకుండా ఇతర మౌళికసదుపాయాలను టార్గెట్ చేసేందుకు అమెరికా సంసిద్దమైనట్లు తెలుస్తోంది(US Military). దాడులు ఎప్పుడు చేయాలన్న నిర్ణయం ట్రంప్ చేతుల్లో ఉందని, ఆయన ఆదేశాలను అనుసరించి చర్యలు ఉంటాయని అమెరికా అధికారులు చెప్పారు.
అయితే ఈ ఏడాది చివరి లోగా ఎప్పుడైనా ఆ ఆదేశం రావొచ్చు అని అన్నారు. దాదాపు మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ఆదేశాలు అందే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అయితే అమెరికా మిలిటరీ(US Military) వ్యూహాలను ఇరానీ దళాలు సలువుగానే అర్థం చేసుకుంటున్నట్లు అమెరికా అధికారులు అంగీకరించారు. కానీ ఈ సారి విస్తృత స్థాయిలో టార్గెట్లను సెట్ చేసినట్లు పెంటగాన్ చెబుతోంది. ఇరానీ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ సైట్స్, న్యూక్లియర్ ఫెసిలిటీలను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాడ్ చెప్పింది.
మధ్యంతర ఎన్నికల తర్వాత చేపట్టబోయే వ్యూహాల గురించి ఇంకా ట్రంప్ ఆలోచన చేయలేదని మీడియా సంస్థతో ఆ అధికారులు వెల్లడించారు. వైట్‌హౌజ్ మాత్రం ఈ నివేదికపై స్పందించలేదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
