- చివర్లో పెరిగిన కొనుగోళ్లు..
- పుంజుకున్న సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం ఒడుదొడుకుల మధ్య లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌లో కొంత బలహీనత కనిపించినా, చివర్లో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు పుంజుకున్నాయి. ముఖ్యంగా మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలోనూ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో మార్కెట్లకు బలం చేకూరింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 482 పాయింట్లు (0.66 శాతం) పెరిగి 73,606.75 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 153.20 (0.68 శాతం) లాభంతో 22,753.20 వద్ద ముగిసింది.
మెటల్ షేర్లు మార్కెట్ ర్యాలీకి ప్రధానంగా దోహదపడ్డాయి. నిఫ్టీ మెటల్ సూచీ 2.2 శాతం ఎగబాకింది. ఫార్మా షేర్లలోనూ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో నిఫ్టీ ఫార్మా సూచీ 1.67 శాతం పెరిగింది. హెల్త్‌కేర్ షేర్లు కూడా లాభాలు నమోదు చేశాయి. మరోవైపు మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. విస్తృత మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.19 శాతం పెరగగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.38 శాతం లాభపడింది. ఉదయం బలహీనంగా ఉన్న ఈ షేర్లు చివర్లో కోలుకోవడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
