- రసం చేసుకుని తీసుకుంటే బెస్ట్..
- రోగనిరోధక శక్తి పెరుగుతుంది..
వామాకు చారు లేదా అజ్వైన్ లీవ్స్ రసం.. తెలుగు వంటకాలలో ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇది కేవలం రుచిని అందించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. వామాకులలో(Ajwain Leaves) మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇవి ఎంతో సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉంటాయి. అలాగే.. క్యాల్షియం, ఐరన్, పొటాషియం.. యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ వామాకు చారును,(Ajwain Leaves) వేడి వేడి అన్నంతో కలిపి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
