Tuesday, April 21, 2026
Homeసాహిత్యంAwareness | భాగ్యమే

Awareness | భాగ్యమే

ఓటు విలువ గుర్తించుము
చేటు నెరిగి పయనించుము
ఆశల గుండమున మునిగి
నోటుకు బానిస కాకుము

నేతను గని ఓటు వేయి
మాటలమూటలకు సోయి
మరచి నీవు శయనించిన
తలరాతలు మారు న్తోయి

- Advertisement -

గతమనునది కట్టి పెట్టు
వర్తమానికి సానపట్టు
పై రెంటిని గమనిస్తూ
భవిత నొసగు ఆయుపట్టు

ఆవులిస్తూ లెక్కించకు
ఆదమరచి నిద్రించకు
మగత మత్తున జోగుతూ
పుణ్య తిథి విస్మరించకు

నీవే దేశ పనిముట్టు
కలుపు మొక్కల మెడలు పట్టు
భయం విడిచి రణం సలిపిన
భాగ్యమే తలుపు తట్టు

- Advertisement -
RELATED ARTICLES

Latest News