HomeజాతీయంKalvakuntla Kavitha | హిందూ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేస్తామంటే ఊరుకోం

Kalvakuntla Kavitha | హిందూ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేస్తామంటే ఊరుకోం

  • కేంద్రాన్ని హెచ్చరించిన తెలంగాణ రక్షణ సేన ఛీప్ కల్వకుంట్ల కవిత
  • ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం

ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతిష్టాత్మక హిందూ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కేంద్రాన్ని హెచ్చరించారు. కళాశాల ప్రత్యేక వారసత్వాన్ని, గుర్తింపును కాపాడుకునేలా, కాలేజ్ ను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు నెలన్నరగా విద్యార్థులు, కాలేజ్ ప్రొఫెసర్లు చేస్తున్న ఆందోళనకు ఆమె మద్దతు తెలిపారు. బుధవారం హిందూ కాలేజ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు.

వారి పోరాటానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 130 ఏళ్లుగా ఎంతో మంది మేధావులను అందించిన, చారిత్రక వారసత్వం కలిగిన ఈ కాలేజ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రైవేట్ సంస్థలు ఈ కాలేజ్ నిర్వహణకు నిధులు ఇచ్చినంతా మాత్రాన వారికే దాన్ని కట్టబెట్టాలని చూడటం ఎంతమాత్రం సరికాదన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం డొనేషన్లు ఇస్తున్న ప్రైవేట్ సంస్థలకు పరిమితమైన సౌకర్యాలు మాత్రమే కల్పించాలని సూచించారు. నిధుల వంకతో కాలేజ్ ను ప్రైవేట్ వారికి అప్పగించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.

- Advertisement -

కేంద్రం స్పందించకపోతే తీవ్ర ఉద్యమం

నెలన్నరగా విద్యార్థులు, ప్రొఫెసర్లు, కాలేజ్ సిబ్బంది ధర్నా చేస్తున్న కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదని కవిత ప్రశ్నించారు. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కాలేజ్ అడ్మిషన్లలో జరుగుతున్న అవకతవకలు, కాలేజ్ ను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలపై విద్యార్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు.

విద్యార్థుల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ఆందోళనలు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారికి అండగా తాము నిలబడతామన్నారు. న్యాయబద్దంగా జరిగే ఏ పోరాటానికైనా తాను మద్దతిస్తానని..హిందూ కాలేజ్ విద్యార్థులు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. వారి ఆందోళనలు పరిగణలోకి తీసుకోని కాలేజ్ ను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను మానుకోవాలని కేంద్రానికి సూచించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News