Homeసినిమా‘King 100’ | మూవీ నుంచి మహంతి ఝాన్సీ రాణిగా టబు

‘King 100’ | మూవీ నుంచి మహంతి ఝాన్సీ రాణిగా టబు

కింగ్ నాగార్జున అక్కినేని తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘కింగ్ 100’(King 100) పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండగా, రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె మహంతి ఝాన్సీ రాణిగా కనిపించనున్నారు.

టబు పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. “ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. లక్ కు నమ్మేవాళ్లు ఒకరు, హార్డ్ వర్క్ ని నమ్మేవాళ్లు మరొకరు. ఐ హేట్ లక్” అనే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఆత్మవిశ్వాసం, పవర్ ను పరిచయం చేశారు. భారీ జనసమూహం ముందు టబు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడం, ప్రజలకు అభివాదం చేస్తూ పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో గ్లింప్స్  క్యూరీయాసిటీ పెంచింది.

- Advertisement -

28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మరోసారి తెరపై కలసి నటిస్తున్నారు.  ఈసారి వారి కథ ప్రేమ చుట్టూ కాదు.. వార్ తో సాగనుంది. ఈ  గ్లింప్స్‌లో మహంతి ఝాన్సీ రాణిగా టబు తనదైన ముద్ర వేశారు. హుందాతనం, అధికార దర్పం ఆమె పాత్రలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆమె కమాండింగ్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది. అందమైన చీరకట్టులో టబు కనిపించిన తీరు, ఆమె పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రాజసం ఉట్టిపడే హావభావాలు.. ఎలాంటి ప్రతిఘటననైనా ఎదుర్కొనే శక్తిమంతమైన మహిళగా ఆమె పాత్రను ఆవిష్కరిస్తున్నాయి. ఈ గ్లింప్స్ ఆమె పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో తెలియజేస్తోంది.

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా టబు పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కూడా ప్రేక్షకుల్లో తక్షణమే ఆసక్తిని పెంచింది. సినిమా నుంచి వస్తున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పెంచుతోంది.  దర్శకుడు రా కార్తీక్ ఎలాంటి  పవర్ ఫుల్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారో ఈ గ్లింప్స్ సూచిస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ గ్రాండియర్ గ్లింప్స్ అంతటా కనిపిస్తోంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు విజువల్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ రాజా మహదేవన్ స్టైలిష్ విజువల్స్ అందించగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గ్లింప్స్ ఇంటన్సిటీ మరింత పెంచారు. నవీన్ నూలి ఎడిటింగ్, సతీష్ కుమార్ ఎన్ ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు.

‘కింగ్ 100’(King 100) చిత్రం డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

నటీనటులు:
కింగ్ నాగార్జున, టబు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రా కార్తీక్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రాజా మహదేవన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: సతీష్ కుమార్ ఎన్
పీఆర్ఓ: వంశీ–శేఖర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News