“ నాన్న “ అనే పిలుపు మధురమైనది
“ తాత “ అనే పిలుపు మరింత మధురమైనది-
“ నాన్న “ అని పిలిపించుకున్నప్పుడు …
ఇంకా తీరని బాధ్యతలు
ఉద్యోగం లేదా వ్యాపారం గురించి ఒత్తిడి
పిల్లల ఆరోగ్యం…చదువులపై శ్రద్ధ…
పిల్లల భవిష్యత్తు గురించి
నిరంతర చింతన
క్రమం తప్పక వేసే ప్రణాళికలు
తమ గురించి ఆలోచించే సమయం
దొరకని తీరికలేని పరిస్థితి-
“తాత “అని పిలిపించుకున్నప్పుడు..(Grandfather’s Love)
బాధ్యతల బరువు చాలామట్టుకు తగ్గుతుంది ..
చింతల స్థానం లో చిరునవ్వులు-
ప్రణాళికల స్థానం లో ప్రశాంతత-
అప్పటి వరకు పడిన శ్రమకు
ఫలితం లభించే స్థితి-
“ నాన్న “ అనే పిలుపు జీవితానికి
అర్ధం నేర్పితే …
“ తాత “ అనే పిలుపు ఆ జీవితానికి
పరిపూర్ణతను చేకురుస్తుంది-(Grandfather’s Love)
మనవరాలి రూపంలో
మన కూతురి చిన్ననాటి రూపం…
మనవడి రూపంలో
మన కొడుకు చిన్ననాటి రూపం
మళ్లీ కనిపించి మనల్ని
ముగ్ధుల్ని చేస్తాయి..
వాళ్ల చిన్న చిన్న అడుగుల్లో
మనమూ అడుగులు వేస్తూ
చిన్నపిల్లలమైపోతాము-
మన పిల్లలకు “ఐస్ క్రీమ్ తినొద్దు “అని
చెప్పిన మనమే.. మన కూతురు వద్దన్నా
దొంగచాటుగా ఐస్ క్రీమ్ కొనిపెడతాం
అది తప్పు అని తెలిసినా
ఆ తప్పు చల్లగా..తీయగా ఉంటుంది-
“నాన్న” ప్రేమలో క్రమశిక్షణ ఉంటుంది
“తాత “ ప్రేమలో గారాబం ఉంటుంది-
మనవడు…మనవరాళ్లతో
“ కార్టూన్స్ “ చూస్తూ చూస్తూ
మనమూ “కార్టూన్స్ “ కి అభిమానులమవుతాము-
ఒకప్పుడు మన పిల్లలపై
చిన్న చిన్న తప్పులకు
చిరాకు..కోపం చూపించిన మనం
మన మనవడు..మనవరాళ్లను
మన పిల్లలు మందలిస్తే మాత్రం భరించలేము…
ఒకప్పుడు మనం కేవలం
“పేరెంట్స్ “ మాత్రమే
కానీ ఇప్పుడు మనం
“గ్రాండ్ పేరెంట్స్ “(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
