Homeసాహిత్యంIndia | ఆనాడు - ఈనాడు

India | ఆనాడు – ఈనాడు

ఆనాడు….

మనమంతా భారతీయులం
భరతమాత పుత్ర పౌత్రులం(India)
స్వేచ్ఛా పథ విహంగాలం
ప్రజా సామ్య రథసారదులం

- Advertisement -

సభ్యత సంస్కారవంతులం
సత్ సాంప్రదాయ పౌరులం
దేశానికి వెన్నెముక లాంటి మనుషులం
ఐక్యతే పురోగమన ప్రేమికులం

విశ్వము లోనే మేరు నగ ధీరులం
పాశ్చాత్య నాగరికథకు విరోధులం
పురాణ ఇతిహాసాల పరిమళాలం
భగవద్గీత హిత వచనాలకు దాసులం

ఈనాడు……

పైకి ధగధగ మెరిసే పత్తి విత్తులం
లోన గరళ తేనె పూసిన కత్తులం(India)
మాటకు మతిలేని వారసులం
పూట గడిస్తే చాలనుకునే వెదవలం

రాక్షసానంద పారాయణులం
రావణుడిని పూజించే విజ్ఞులం
రాముడిని ప్రశ్నించే భలే మూర్ఖులం
సీతలను వేధించే దుశ్శాసనుని తమ్ములం

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టే శకునులం
అబద్ధాలతో ఊరేగుతున్న పాలకులం
నిజాలను దహనం చేయించే విశ్వామిత్రులం
ప్రజలకు పొదుపు దండక ప్రసాద సుయోధనులం(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News