- రికార్డు స్థాయి ఫలితాలతో సత్తా చాటిన వైనం..
సిఎంఎస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరోసారి తమ విద్యా ప్రావీణ్యాన్ని నిరూపిస్తూ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి, తెలంగాణలో కామర్స్ విద్యలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. తమ విజయ పరంపరను కొనసాగిస్తూ, సిఎంఎస్ వరుసగా 14 సంవత్సరాలు ఎంఈసి లో రాష్ట్ర ప్రథమ మార్కులు సాధించడం ద్వారా విశేషమైన మైలురాయిని చేరుకుంది. ఈ ఘనతను సాధించిన ఏకైక కామర్స్ కాలేజ్ గా నిలిచిన సిఎంఎస్, భారతదేశంలో నంబర్ 1 కామర్స్ కాలేజ్ తన స్థానాన్ని మరింత బలపరచుకుంది. జూనియర్ ఎంఈసి విభాగంలో, జోహా ఉన్నిసా 496/500 మార్కులతో రాష్ట్ర ప్రథమ స్థానాన్ని సాధించారు. రాష్ట్ర ద్వితీయ స్థానాన్ని కార్తిక్ రెడ్డి, సాయి రఘు రామ్, శ్రీవాణి మరియు నిర్విగ్న (495/500) పంచుకున్నారు.
అలాగే, 494/500 మార్కులతో 10 మందికి పైగా విద్యార్థులు రాష్ట్ర తృతీయ స్థానాన్ని సాధించారు. మొత్తం మీద, 100 మందికి పైగా సిఎంఎస్ విద్యార్థులు రాష్ట్రంలో టాప్ 10 స్థానాలు పొందడం, ఈ సంస్థ యొక్క నిరంతర విద్యా ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తుంది. సిఈసి విభాగంలో, రహీలా బేగం 494/500 మార్కులతో రాష్ట్ర ప్రథమ స్థానం సాధించి, సంస్థకు మరింత గౌరవాన్ని తీసుకువచ్చారు. సీనియర్ ఎంఈసి ఫలితాల్లో, జాస్ధితా రెడ్డి, తనిష్క 991/1000 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. అలాగే, ఇక్కడ కూడా 100 మందికి పైగా విద్యార్థులు రాష్ట్ర టాప్ 10లో స్థానం సంపాదించారు.

ఈ సందర్భంగా సిఎంఎస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ సిఎ చంద్రశేఖర్ రావు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ… ‘ఈ ఫలితాలు కేవలం మార్కులు మాత్రమే కావు, ఇవి మా విద్యార్థుల క్రమశిక్షణ, మా అధ్యాపకుల అంకితభావం, తల్లిదండ్రుల నిస్వార్ధమైన మద్దతుకు ప్రతిబింబం. వరుసగా 14 సంవత్సరాలు రాష్ట్ర ప్రథమ మార్కులు సాధించడం ఒక చారిత్రాత్మక ఘనత భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో భాగస్వాములమవడం మాకు గర్వకారణం. “అని తేలిపారు.
ఇంటర్మీడియట్ విద్యను సమగ్రంగా కలిపి, విద్యార్థులను పోటీ ప్రపంచానికి సిద్ధం చేయడంలో సిఎంఎస్ నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సిఎంఎస్ యాజమాన్యం, తమపై విశ్వాసం ఉంచిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఉత్తమ విద్యను అందించే తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. మరోసారి అద్భుత ఫలితాలతో, సిఎంఎస్ విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు ప్రేరేపిస్తూ, మరిన్ని విజయాలను సాధించడానికి మార్గనిర్దేశం చేస్తోందని అన్నారు.
