నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను గురువారం టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్ అక్క కార్యక్రమానికి గాను స్కోచ్ అవార్డు అందుకున్న సందర్భంగా వారికి బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీందర్, భూమయ్య, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
