- అధికారులు కఠిన చర్యలు చేపట్టాలి.
- ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలి..
- జీ.హెచ్.ఎం.సి. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కి విన్నపం..
- విన్నవించిన వినియోగదారుల మండలి సభ్యులు..
మామిడికాయలను కృత్రిమంగా పండ్లుగా మార్చటానికి వ్యాపారస్తులు కార్బైడ్ వాడకాన్ని వాడటం పై నిషేధం, అమలు కొరకు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ బుధవారం రోజు వినియోగదాల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, భారత వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అందే శ్రీధర్ రెడ్డిలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మూర్తి రాజుకు ఆయన కార్యాలయంలో కలిసి విన్నవించడం జరిగింది.
మామిడి పండ్లే కాకుండా అనేక రకాల పండ్లను కృత్రిమంగా పక్వం చేయడానికి వ్యాపారస్తులు కార్బైడ్ వాడకం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హానికర పరిస్థితులు ఏర్పడుతున్న క్రమంలో, కార్బైడ్ వాడకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించడం జరిగింది. అయితే ఈ నిషేధం అమల్లో ఉన్నా కూడా, అవగాహన లేని కొందరు వ్యాపారస్తులు ఇష్టారీతిగా కార్బైడ్ వాడటం, వినియోగదారులు ముఖ్యంగా మహిళలు, పిల్లలు కృత్రిమ పండ్లను తినడంతో ఆరోగ్యపరంగా మోసపోతున్నారని సాంబరాజు చక్రపాణి తెలుపుతూ, తమ కౌన్సిల్ నిరంతరం ఈట్ రైట్ ఫుడ్ సర్వే నిర్వహిస్తూ, అనుచిత వ్యాపార విధానాలను అధికారుల దృష్టికి తేవడం జరుగుతున్నదని అన్నారు .
హైదరాబాదులోని పలు మార్కెట్లలో మామిడికాయల సీజన్ ప్రారంభమై కొన్ని చోట్ల కార్బన్ వాడకంపై ఫిర్యాదులు వస్తున్న క్రమంలో వినియోగ ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి అందె శ్రీధర్ రెడ్డి లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ను కలిసి వివరాలను తెలపడం జరిగింది. ముఖ్యంగా వ్యాపారస్తులకు కార్బైడ్ పై అవగాహన. హానికరమైన పరిస్థితులను వారికి తెలియజేసే విధంగా రూపొందించిన పోస్టర్ ని మూర్తి రాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల పండ్లను కొనుగోలు చేసే సమయంలో వీలైనంతవరకు ఆయా పండ్లను ఉప్పు నీరుతో శుభ్రం చేసుకుని తినాలని తెలిపారు. రంగును చూసి మోసపోకూడదని అన్నారు. ఆహర కల్తీ నిరోధక శాఖ నిరంతరం కార్బైడ్ వాడకం పై దాడులు నిర్వహిస్తున్నదని తెలిపారు. పోలీస్ శాఖ కూడా నిరంతరం నిఘా పెడుతున్నారని అన్నారు. కాబట్టి వినియోగదారులు, వ్యాపారస్తులు చైతన్యవంతులై జాగ్రత్తగా ఉండాలని మూర్తి రాజు సూచించారు.
