Thursday, February 26, 2026
Homeహైదరాబాద్‌Arrive Alive | డ్రైవర్లకు భద్రతపై అవగాహన కార్యక్రమం..!

Arrive Alive | డ్రైవర్లకు భద్రతపై అవగాహన కార్యక్రమం..!

మల్కాజిగిరి కమీషనర్ సూచనల మేరకు, గురువారం ఉదయం ఆటోనగర్‌లోని టీజీఐఐసీ కార్యాలయంలో డ్రైవర్లకు నేత్రాలయ ఐ హాస్పిటల్ సహకారంతో ట్రాఫిక్ వింగ్‌తో కలిసి అరైవ్ అలైవ్ రోడ్డు సేఫ్టీ ప్రచారంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో ఎల్బీ నగర్ జోన్ డీసీపీ అనురాధ, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, డీసీపీ మనోహర్, ఏసీపీ కాసిరెడ్డి, ఏసీపీ నవీన్ రెడ్డి, వనస్థలిపురం ఎస్హెచ్ఓ మహేష్ కుమార్ గౌడ్, డీఐ రాజేష్ , ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు ఘట్టుమల్లు, శ్రీనివాస్ రెడ్డి, వనస్థలిపురం లా అండ్ ఆర్డర్ PS అండ్ ట్రాఫిక్ PS ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో, హైదరాబాద్ లారీ అసోసియేషన్ డ్రైవర్లు, నవత ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు, వరుణ్ మోటార్ డ్రైవర్లు, మెకానిక్ అసోసియేషన్ డ్రైవర్లు మొదలైన దాదాపు 120 మంది సభ్యులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, లేన్ డిసిప్లైన్, డ్రంక్ అండ్ డ్రైవ్, అనధికార పార్కింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్/సీట్‌బెల్ట్ అవసరం మొదలైన వాటి గురించి అధికారులు వివరించారు.

నేత్రాలయ వైద్యులు, వారి సిబ్బంది డ్రైవర్లకు కంటి పరీక్ష నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News