Thursday, February 12, 2026
Homeనల్లగొండTRP | ఎస్ఐ, సీఐ లను సస్పెండ్ చేయాలి.

TRP | ఎస్ఐ, సీఐ లను సస్పెండ్ చేయాలి.

  • 13వ వార్డు ఘటనపై టిఆర్పీ ఆగ్రహం.
  • విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని 13వ వార్డులో నిన్న జరిగిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ) జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పోలింగ్ సమయంలో కారు ఎక్కడానికి వెళ్తున్న టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ కుమారుడిపై దాడి జరగడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన పోలీసు శాఖకు కళంకమని వ్యాఖ్యానించారు. పోలీసులు చట్టానికి లోబడి, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించరాదని సూచించారు.

- Advertisement -

అగ్రవర్ణ పార్టీల నాయకులు వట్టె జానయ్య యాదవ్‌ను బెదిరించే ఉద్దేశంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్పీ 30 వార్డుల్లో పోటీ చేస్తున్నదని, ప్రజల మద్దతు పెరుగుతోందని తెలిపారు. 5 నుంచి 6 వార్డుల్లో పార్టీ విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

టిఆర్పీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల కోసం స్థాపించబడిన పార్టీ అని గుర్తుచేసిన మామిడి అంజయ్య, నాయకులు–కార్యకర్తలపై బెదిరింపులు కొనసాగితే సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే చట్టపరంగా, ఉద్యమాత్మకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

లోయల పాఠశాల ముందు జరిగిన ఘటనకు బాధ్యులని పేర్కొంటూ ఎస్‌ఐ ఏడుకొండలు, సీఐ (రూరల్) రాజశేఖర్‌లపై తక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, సూర్యాపేట మహిళా అధ్యక్షురాలు కొన్నెమంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ మురళి మనోహర్, రంగన్న, వర్మ, గోపి, రంప శ్రీదేవి, తండు నాగలక్ష్మి, బోడపట్ల మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News