Thursday, February 12, 2026
Homeహైదరాబాద్‌OU | ఓయూ సెంటినరీ హాస్టల్ ఘటనపై విద్యార్థినిల మెరుపు ధర్నా

OU | ఓయూ సెంటినరీ హాస్టల్ ఘటనపై విద్యార్థినిల మెరుపు ధర్నా

  • విద్యార్థిని తల్లిని లోపలికి అనుమతించలేదని ఆరోపణలు
  • డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటినరీ లేడీస్ హాస్టల్‌లో చోటుచేసుకున్న ఘటనపై విద్యార్థినిలు ఆర్ట్స్ కళాశాల ముందు మెరుపు ధర్నాకు దిగారు.బుధవారం సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో తన కుమార్తెను కలవడానికి హాస్టల్‌కు వచ్చిన ఓ విద్యార్థిని తల్లిని హాస్టల్‌లోకి అనుమతించలేదని ఆరోపిస్తూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు.విద్యార్థినిలు తెలిపిన వివరాల ప్రకారం,సాయంత్రం 3 గంటల నుంచి ఆ తల్లిని హాస్టల్ వెలుపలే నిలబెట్టినట్లు తెలిపారు.

తల్లిని లోపలికి అనుమతించకుండా ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని,ఇది మానవతా విలువలకు విరుద్ధమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత లేడీస్ హాస్టల్ డైరెక్టర్ వ్యవహరించిన తీరు నిర్లక్ష్యపూరితమని ఆరోపిస్తూ,వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆర్ట్స్ కాలేజ్ ముందు పెద్ద సంఖ్యలో విద్యార్థినిలు చేరి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.తల్లిని అనుమతించకపోవడం దారుణం,విద్యార్థుల హక్కులను గౌరవించాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.హాస్టల్ నిబంధనల పేరిట తల్లిదండ్రులను అవమానించే విధంగా వ్యవహరించకూడదని వారు పేర్కొన్నారు.

- Advertisement -

ఘటనపై విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు స్పందించి,పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు కోరుతున్నారు.పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థినిలతో చర్చలు జరిపారు.ఈ ఘటనపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందన కై అక్కడే కూర్చుని నిరసన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News