Wednesday, February 25, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | అవినీతి వైరస్..

Corruption | అవినీతి వైరస్..

  • వైద్య విద్యాశాఖలో ‘పదోన్నతుల’ దందా?
  • అర్హులకు అన్యాయం.. అక్రమార్కులకు అండ!
  • బయోకెమిస్ట్ పదోన్నతుల్లో భారీ కుంభకోణం!
  • విచారణకు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ డిమాండ్
  • బయోకెమిస్ట్ పదోన్నతుల వ్యవహారంలో డీఎం ఈ అలసత్వంపై నిరసన!
  • లోపాలకు అద్దం పడుతున్న పదోన్నతుల వ్యవహారం.. హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్

వైద్య విద్యాశాఖలో పారదర్శకతకు నిలువుటద్దంగా ఉండాల్సిన పదోన్నతుల ప్రక్రియ, నేడు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బయోకెమిస్ట్ పదోన్నతుల విషయంలో జరుగుతున్న పరిణామాలు వ్యవస్థలోని లోపాలను, కొందరు అధికారుల బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి.

గౌరవ హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని, సర్టిఫికెట్ల నిజానిజాలను తేల్చి నాలుగు నెలల్లో సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఆదేశించినా.. తొమ్మిది నెలలు గడిచినా విచారణ అడుగు ముందుకు పడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇది వ్యవస్థలో తిష్టవేసిన అలసత్వానికి నిదర్శనం.

- Advertisement -

తెలంగాణ వైద్య విద్యాశాఖ (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలో బయోకెమిస్ట్ పదోన్నతుల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని కోరుతూ తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (సెంట్రల్ అసోసియేషన్) రాష్ట్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించింది.

2024-, 2017-18, 2019-20 ລ້ 25 సంవత్సరాల్లో నిర్వహించిన పలు పదోన్నతి ప్యానళ్లలో తీవ్ర విధానపరమైన లోపాలు మరియు అక్రమాలు చోటుచేసుకున్నా యని అసోసియేషన్ ఆరోపించింది. గత ప్యానల్ సంవత్సరాల్లో నకిలీ మరియు అర్హతలేని అభ్యర్థులకు పదోన్నతులు కల్పించా రని, ఈ విషయం ప్రస్తుతం పరిశీలనలో ఉందని పేర్కొంది.

మునుపు ఒక విజిలెన్స్ విచారణను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని, అలాగే అక్రమంగా జరిగిన పదోన్నతులను సరిదిద్దలేదని అసోసియేషన్ తెలిపింది. కొంతమంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారని పేర్కొంది. ఈ కేసులో 2024 డిసెంబర్ 10న ఇచ్చిన ఉత్తర్వుల్లో, సర్టిఫికెట్ల నిజానిజాలను సమగ్రంగా పరిశీలించి, నాలుగు నెలల్లో సీనియారిటీ జాబితాను పునఃరూపకల్పన చేయాలని డిఎంఈ అధికారులను హైకోర్టు ఆదేశించినట్లు అసోసియేషన్ తెలిపింది. అయితే తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటివరకు విచారణ ప్రారంభం కాలేదని ఆరోపించింది.

ఫిర్యాదులో జీ-సెక్షన్లో పనిచేస్తున్న ఒక సీనియర్ అసిస్టెంట్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఆమె గత ఎనిమిదేళ్లుగా అదే పోస్టులో కొనసాగుతూ ఈ అవకతవకల్లో కీలక పాత్ర పోషించి ందని అసోసియేషన్ ఆరోపించింది. ఆమెను అదే సెక్షన్లో కొనసాగించడం వల్ల పారదర్శకత మరియు బాధ్యత లోపించాయని పేర్కొంది.

అవకాశం అదేవిధంగా, 2024-25 బయోకెమిస్ట్ పదోన్నతి ప్యానల్లో కూడా అక్రమాలు జరిగాయని అసోసియేషన్ తెలిపింది. తాత్కా లిక సీనియారిటీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిం చకుండానే పదోన్నతులు ఖరారు చేశారని ఆరోపించింది. తాత్కాలిక సీనియారిటీ జాబితాలో పేరు లేని ఒక ఉద్యోగిని సరైన కారణాలు చూపకుండా, అభ్యంతరాలకు ఇవ్వకుండానే తుది జాబితాలో చేర్చినట్లు పేర్కొంది.

అవసరమైన అర్హతలను పొందేందుకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండగా, ఆ వివరాలకు సంబంధించిన కాలమ్ను తుది పదోన్నతి జాబితాలో ఉద్దేశపూర్వకంగా తొలగించారని అసోసియేషన్ ఆరోపించింది. దీని వల్ల అర్హతలేని కొందరికి లబ్ధి చేకూరగా, ముందస్తు అనుమతి పొందిన అర్హులైన ఉద్యోగులకు అన్యాయం జరిగిందని పేర్కొంది.

సరిదిద్దే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించి, సంబంధిత అధికారులపై సీసీఏ (సీసీఏ) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రిని అసోసియేషన్ కోరింది. అలాగే పరిపాలనలో పారదర్శకత మరియు బాధ్యతను నిర్ధారించేందుకు, జీ-సెక్షన్లో పనిచేస్తున్న సంబంధిత సీనియర్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సూపరింటెండెంట్ను తక్షణమే బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది.

“ఆరోగ్య శాఖ అంటే కేవలం రోగులకు సేవ చేయడం మాత్రమే కాదు.. ఆ సేవ చేసే సిబ్బందికి న్యాయం జరిగేలా చూడటం కూడా.” ఈ నేపథ్యంలో, మంత్రి ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా.. వ్యవస్థలో పేరుకుపోయిన ఈ ‘వైరస్’ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News