Friday, February 13, 2026
Homeనల్లగొండAlair | జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి

Alair | జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి

  • చింతల ఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి..

ఆలేరు మున్సిపాలిటీలోని 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల ఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి వార్డులో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను,సంక్షేమ పథకాలను వార్డు సభ్యులకు వివరించారు.గతంలో తాము కౌన్సిలర్ గా ఉన్నపుడు అధికార పార్టీలో లేకున్న దాదాపు 80 లక్షల రూపాయలతో 1వ వార్డులో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు.

తమను కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ ప్రచారంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ,కృష్ణ,శ్రీలత,ఎండి బాబా,పాషా,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News