Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌DK Aruna | మునిసిపాలిటీలకు కాంగ్రెస్ పైసా ఇవ్వట్లేదు

DK Aruna | మునిసిపాలిటీలకు కాంగ్రెస్ పైసా ఇవ్వట్లేదు

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం(Congress Party Government) మునిసిపాలిటీలకు(Municipalities) నయా పైసా కూడా ఇవ్వట్లేదని మహబూబ్‌నగర్ ఎంపీ(Mahabubnagar MP) డీకే అరుణ విమర్శించారు. ప్రజలు కట్టిన పన్నులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు(Central Funds) తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులేమీ రావట్లేదని అన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదని చెప్పారు. ఒకవైపు.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని సీఎం చెబుతుంటే మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు హామీలిచ్చి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. మునిసిపాలిటీలకు ప్రధానంగా కావాల్సింది పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజ్, వీధి లైట్లు అని తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని వెల్లడించారు. ప్రణాళికబద్దంగా మునిపాలిటీలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ‘దేవరకద్ర కొత్తగా మునిసిపాలిటీ అయింది. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కలిపి మునిసిపాలిటీ చేశారు. దేవరకద్ర నుంచి ఆయా గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు సరిగా లేవు. మునిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వ నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని డీకే అరుణ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News