Homeవరంగల్‌Ponguleti | ఆ రెండు చైర్మన్ పీఠాలూ కాంగ్రెస్‌కే

Ponguleti | ఆ రెండు చైర్మన్ పీఠాలూ కాంగ్రెస్‌కే

మునిసిపల్ ఎన్నికల(Municipal Elections) నేపథ్యంలో శనివారం వర్ధన్నపేట(Vardhanpet), స్టేషన్‌ఘనపూర్‌(StationGhanapur)లో జరిగిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. సర్వేలో ఎవరికైతే మెరుగైన ఫలితాలు వస్తాయో, ప్రజాదరణ ఉన్నట్లు తెలుస్తుందో, గెలిచే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికే పార్టీ పరంగా టికెట్ కేటాయించి బీఫాం ఇస్తాం. వర్ధన్నపేట, స్టేషన్‌ఘనపూర్ మునిసిపాలిటీలో వంద శాతం కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. రెండు చోట్ల తప్పకుండా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం, సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలాగైతే కష్టపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారో అదేవిధంగా ఈ మునిసిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి. మునిసిపాలిటీలకు ఇచ్చే ప్రతి హామీని నెరవేర్చి, అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా’ అని పొంగులేటి హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News