- పార్టీ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్ర చారి పిలుపు.
చలో ఖమ్మం ఎస్సార్ అండ్ బిజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ఈనెల 18న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిమంది పార్టీ శ్రేణులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల అఖిల భారతస్థాయి ముగింపు ఉత్సవాలకు రంగారెడ్డి జిల్లా నుండి సిపిఐ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్ర చారి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం రావి నారాయణరెడ్డి కాలనీ, సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్టు మండల పార్టీ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్ర చారి,సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి తో కలసి మాట్లాడారు.
భారత కమ్యూనిస్టు పార్టీ 2025 డిసెంబర్ 26 నాటికి100 వసంతాలు పూర్తిచేసుకుని 101 వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు.వ్యవసాయ రంగ పరిరక్షణకు,రైతాంగ శ్రేయస్సుకు పోరాడిందన్నారు. ఈ పోరాట క్రమంలో అనేకమంది అమరులయ్యారని అమరుల త్యాగాలను శతాబ్ద ఉత్సవాల సందర్భంగా మననం చేసుకొన్నామన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కానున్నామని వారన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిరంకుశ నిజామును గద్ద దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేలమంది ప్రాణ త్యాగాలతో 3000 గ్రామాల విముక్తి 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది అన్నారు. నాటి సాయుధ పోరాటమే అనేక ఉద్యమాలకు వేదికైందన్నారు.సొంత ఇల్లు లేని నిరుపేదల కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటాలు నిర్వహించి
