Sunday, February 22, 2026
Homeహైదరాబాద్‌Book Fair | పుస్తక ఆవిష్కరణ మహోత్సవం 38వ హైదరాబాద్ బుక్

Book Fair | పుస్తక ఆవిష్కరణ మహోత్సవం 38వ హైదరాబాద్ బుక్

  • ఫెయిర్ లో తెలంగాణ సాహితీ, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మానువాడ శంకర్ కు సన్మానం పలువురు అభినందనలు

పుస్తక ఆవిష్కరణ మహోత్సవం లో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ,ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాదులోని, కొంపల్లి వెంకట్ గౌడ్ వేదికలో, నిజ జీవిత కథలలో శంకర్ రాసిన “రాజు సామాజిక సేవా తత్పరుడు ” అనే కథను” నిజజీవిత కథలు” పుస్తకంలో ప్రచురించడం జరిగింది. కవి పబ్లికేషన్స్ హైదరాబాద్ వారు ఈ పుస్తకమును ప్రచురించడం జరిగింది . ఈ పుస్తకమును హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఆవిష్కరించడం జరిగింది. ఇందుకుగాను వీరికి కుసుమ ధర్మన్న కళాపీఠం హైదరాబాదు వారు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యదర్శి వాసు , కుసుమ ధర్మన్న కళా పీఠం హైదరాబాద్ అధ్యక్షురాలు కుసుమ రాధా మాట్లాడుతూ..

ఈ పుస్తకములో రచనలు కథలు నిజజీవితంలో అనుభవించిన కథలు చాలా చక్కగా రచయితలు రాశారని ఇవి ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని మాట్లాడారు పుస్తక సంపాదకులు కవితా భేటీ ,ప్రసన్న కిరణ్, పురుషోత్తం సతీష్, కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ ను కరీంనగర్ లయన్స్ క్లబ్ గోల్డెన్ శాతవాహన అధ్యక్షులు గిరిధర్ రావు,కరీంనగర్ శాతవాహన కాలనీ అధ్యక్షులు రాములు, మేల్కోనవతారం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ బిరుదుల ప్రవీణ్ కుమార్,అనుపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జి విట్టల్, ఉపాధ్యాయులు రమేషు, దేవేందర్, రవీందర్, రమేష్, లయన్స్ క్లబ్ సభ్యులు, శాతవాహనం కాలనీ సభ్యులు కవులు, రచయితలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News