Sunday, February 22, 2026
HomeతెలంగాణHigh Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

  • పలు మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌పై
  • డీజీపీ నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించిన హైకోర్టు
  • తదుపరి విచారణ జనవరి 20వ తేదీకి వాయిదా

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) చట్ట సవరణపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్పై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీల్లో తుక్కుగూడ కూడా ఒకటి.ఈ క్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండా తుక్కుగూడ మున్సిపాలిటీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేశారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్పై బుధవారం (డిసెంబర్‌ 24) విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్పై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News