HomeతెలంగాణKTR | సీఎం రేవంత్ సోదరులపై ఆరోపణలు..

KTR | సీఎం రేవంత్ సోదరులపై ఆరోపణలు..

  • తీవ్రంగా విమర్శించిన కేటీఆర్..
  • మీడియా సమావేశంలో ఫైర్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు నామమాత్రపు అర్హతలతో భారీ కంపెనీలను రిజిస్టర్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి సోదరులు బడా కంపెనీలకు యజమానులుగా మారుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీలను చిన్న నివాసాల చిరునామాలతో రిజిస్టర్ చేయించారని పేర్కొన్నారు. అటువంటి ఒక కంపెనీకే దాదాపు రూ. 200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టిందని విమర్శించారు. ముఖ్యంగా, అనుముల కొండల్ రెడ్డి తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ‘టెసరాక్’ కంపెనీకి ఛైర్మన్‌గా ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపారు. మరో సోదరుడు జగదీశ్ రెడ్డి కాంట్రాక్టులు దక్కించుకుంటుండగా, ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News